మరింత కమర్షియల్‌గా మారనున్న ఇన్‌స్టాగ్రామ్

by Harish |   ( Updated:2020-09-14 04:52:21.0  )
మరింత కమర్షియల్‌గా మారనున్న ఇన్‌స్టాగ్రామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రారంభంలో అన్నీ ఫ్రీగా ఇచ్చిన సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్.. రాను రాను పూర్తిగా కమర్షియల్‌గా మారిపోతోంది. ఇప్పటికే న్యూస్ ఫీడ్‌లో వాణిజ్య ప్రకటనలు, ఇన్‌ఫ్లూయన్సర్ల బ్రాండ్ ప్రమోషన్‌లను మానిటైజ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ త్వరలో ఫొటో క్యాప్షన్‌లో లింక్‌ను యాక్టివేట్ చేయడానికి కూడా డబ్బు వసూలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఫొటోకు క్యాప్షన్ పెట్టేటపుడు ఏదైనా లింక్‌ను పేస్ట్ చేయాలనుకుంటే చార్జ్ వేయనుంది. ఇప్పటి వరకు ఫొటోకు క్యాప్షన్‌‌లో లింక్‌ను పెట్టుకునే సౌకర్యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టలేదు. అందుకే ఏదైనా లింక్‌ను చెప్పాలనుకుంటే యూజర్‌లు ‘లింక్ ఇన్ బయో’ అని రాస్తుంటారు. ఇక నుంచి ఈ అవసరం ఉండదు. కాకపోతే దానికి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఈ విషయమై ఇన్‌స్టాగ్రామ్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుందని, ఆ పేటెంట్ డ్రాఫ్ట్ ప్రకారం ఫొటో క్యాప్షన్‌లో లింక్‌ను యాక్టివేట్ చేయడానికి 2 డాలర్లు చార్జ్ చేయనుందని ప్రోటోకాల్ రిపోర్ట్ వెల్లడించింది. క్యాప్షన్‌లో లింక్ మాదిరిగా ఉండే టెక్స్ట్‌ను పేస్ట్ చేయగానే ఆటోమేటిక్‌గా ఒక పాప్ అప్ వస్తుంది. ఆ పాప్ అప్‌లో ఫొటో క్యాప్షన్‌లో లింక్‌ను యాక్టివేట్ చేయడానికి రెండు డాలర్లను చెల్లించడని చూపిస్తుంది. అలాగే టిక్ టాక్ మాదిరిగా షార్ట్ వీడియో సర్వీస్‌ను రీల్స్ పేరుతో లాంచ్ చేసిన తర్వాత దానికి కూడా పేటెంట్ దరఖాస్తు చేసుకుందని ప్రోటోకాల్ రిపోర్ట్ తెలిపింది. ఇక ఇన్‌స్టాగ్రామ్ పూర్తి స్థాయిలో కమర్షియల్‌గా మారితే దానికి విడిగా ప్రీమియం వెర్షన్ లాంచ్ చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also…

నెట్‌ఫ్లిక్స్ రద్దు.. నిరసనల పద్దు

Advertisement

Next Story

Most Viewed