- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్ స్టార్ స్ఫూర్తి.. చెర్రీ మరో రూ.30లక్షల విరాళం
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) విస్తరిస్తున్న తరుణంలో సామాన్యులను, పేదలను ఆదుకునేందుకు వ్యాపార వెత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. కాగా ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా రూ.70లక్షలు విరాళమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. కరోనా(కోవిడ్ 19) నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అని తెలిపారు. దేశమంతా లాక్‌డౌన్ కావడంతో సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను కాపాడటానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ)ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ కళాకారులను ఆదుకోవడానికి ప్రముఖులు ముందుకు రావాలని సూచించారు. సీసీసీ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి 70 లక్షలు వితరణ చేసిన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు రూ.30 లక్షల విరాళాన్ని సినీ కార్మికుల సహాయ నిధికి అందచేస్తున్నట్లు ప్రకటించారు.