పుట్టినరోజు డేట్స్ నోట్లతో హరీష్‌కు వినూత్న సన్మానం

by Shyam |
పుట్టినరోజు డేట్స్ నోట్లతో హరీష్‌కు వినూత్న సన్మానం
X

దిశ, సిద్దిపేట: జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హజ్ హౌస్ పక్కన శుక్రవారం ఎస్‌బీఐ రీజినల్ బ్యాంకును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌బీఐ రీజినల్ ఆఫీసు సిద్ధిపేటలో ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, లోన్ దరఖాస్తులు ప్రాసెస్ కావాలన్నా.. మీ డెబిట్స్ పెంచుకోవాలనుకున్నా.. హైదరాబాద్ వరకు వెళ్లి చేసుకోవాల్సి వచ్చేదన్నారు. ఇక నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. ఈ సిద్ధిపేట జిల్లా ప్రజలందరికీ హైదరాబాద్ వెళ్లే వ్యయప్రయాసాలు తప్పినట్లు, అన్నీ పనులు ఇక్కడే చేసుకోవచ్చునని, అన్నీ బ్యాంకు కార్యకలాపాలు ఇక్కడి నుంచే చేయొచ్చని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో స్ట్రీట్ వెండర్స్ కోసం బ్యాంకు సేవలు, సహకారం, మహిళా సంఘాలకు రుణాలు అందించటం పట్ల అభినందనలు తెలియజేశారు.

ప్రజలు ఎక్కువగా బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకునే విధంగా ముందుకు సాగాలని కోరారు. అంతకు ముందు ఎస్ బీఐ రాష్ట్ర డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటులో మంత్రి హరీష్ రావు కృషి ఉందన్నారు. స్థానికంగా కార్యాలయం ఏర్పాటు కోసం స్థల సేకరణలో మంత్రి చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. సిద్దిపేటలో ప్రాంతీయ కార్యాలయం వల్ల సిద్దిపేట, మెదక్‌తో పాటు సమీప జిల్లాలోని బ్యాంక్ అధికారులు సిబ్బందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. సిద్దిపేట ప్రాంతీయ కార్యాలయనిర్మాణం సర్కెల్ పరిధిలో ఆదర్శంగా ఉందన్నారు. 24/7 సేవలు అందే విధంగా ప్రాంతీయ కార్యాలయం బ్యాంకు ఎంతో ఉపయోగ పడుతుండుతున్నదన్నారు. వీధి వ్యాపారుల రుణ మంజూరులో దేశానికే బ్యాంక్ ఆదర్శంగా పనిచేస్తుందన్నారు.

వినూత్న సన్మాన ప్రక్రియ

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును బ్యాంకు అధికారులు వినూత్నంగా సన్మానించారు. మంత్రి పుట్టినరోజు అంకెలతో కూడిన మూడు కరెన్సీల ఫొటో ను ఆయనకు బహుకరించారు. అదే విధంగా బ్యాంకు పక్షన మంత్రి పుట్టినరోజు నేపథ్యంలో ఆయన ఫొటో తో కూడిన స్టాంప్ ను బహుకరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, జిల్లా జడ్పి చైర్మన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed