- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మార్ట్ సెన్సిబుల్ ఆక్సిజన్ జనరేటర్ రిలీజ్
దిశ, వెబ్‌డెస్క్: భారత మార్కెట్లో మొట్టమొదటి సారిగా వాణిజ్య, గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు అనువుగా ఉండే సరికొత్త అర్బ్ఆక్స్ ‘ఆక్సిజన్ సెన్సింగ్ స్మార్ట్ ఎయిర్ క్వాలిటీ మానిటర్’ పరికరాన్ని జెఎల్ఎస్ఆర్ వెల్నెస్ సంస్థ ప్రవేశపెట్టింది. నాసా టెక్నాలజీ ఆధారంగా ఈ స్మార్ట్ సెన్సిబుల్ ఆక్సిజన్ జనరేటర్ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. వాణిజ్య, గృహావసరాలను తీర్చేందుకు అనుగుణంగా నాసా అంతరిక్ష సాంకేతికతకు మరింత మెరుగులను అందిస్తూ దీన్ని రూపొందించనట్టు సంస్థ ప్రకటించింది.
వివిధ వాతావరణ పరిస్థితుల్లో నివాస, ఆఫీస్ గదుల్లో ఆక్సిజ స్థాయిలను ఈ పరికరం పర్యవేక్షిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు వినూత్న ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలను అందించే జెఎల్ఎస్ఆర్ వెల్నెస్ సంస్థ తాజా ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర వహించింది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జెఎల్ఎస్ఆర్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వనిత పటేల్ ..ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించేందుకు భారత మార్కెట్లోకి అర్బ్ఆక్స్ స్మార్ట్ సెన్సిబుల్ ఆక్సిజన్ జనరేటర్ పరికరాన్ని మూడు మోడళ్లలో తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
వివిధ అవసరాలను తీర్చేలా, వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుందని వివరించారు. బిల్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మాడ్యుల్స్ లాంట్ స్మార్ట్ ఫీచర్లను కలిగిన ఈ పరికరాన్ని యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ఆధారంగా నియంత్రించవచ్చని తెలిపారు. అతి తక్కువ విద్యుత్ వినియోగాన్ని ఈ పరికరం కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.