- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదాయ పన్ను రిటర్నుల గడువు ముగుస్తుండటంతో అప్రమత్తమైన ఇన్ఫోసిస్!
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు చేసేందుకు గడువు సమీపిస్తుండటంతో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలను పెంచింది. ఆదాయ పన్ను దాఖలు ఈ నెల 31 చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు రూపొందించిన కొత్త వెబ్‌సైట్‌లో పనితీరును పర్యవేక్షించడానికి ఇన్ఫోసిస్ ప్రత్యేక వార్‌రూమ్‌ను ఏర్పాటు చేసింది.
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో దాదాపు 3.59 కోట్ల ఆదాయ పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. రానున్న 15 రోజుల్లో వెబ్‌సైట్ రద్దీ భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా సాఫీగా జరగడానికి సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు. ఈ నెలాఖరుతో ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువు ముగియనుండటంతో రోజుకు 6 లక్షల ఐటీఆర్‌లు నమోదవుతున్నాయని, ఇది రోజురోజుకు పెరుగుతుందని సీబీడీటీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ప్రభుత్వం మూడు సార్లు గడువును పొడిగించింది. ఇటీవల ఇన్ఫోసిస్ అభివృద్ధి చేసిన ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా 2021-22 అసెస్‌మెంట్ ఏడాదికి సంబంధించిన కీలక రిటర్నుల గడువును సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31కి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.