- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్ఫోసిస్ త్రైమాసిక లాభం రూ. 4,321 కోట్లు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌కు ఒత్తిడి తప్పలేదు. లాక్‌డౌన్ వల్ల ప్రాజెక్టులు ఆగిపోవడం, కొత్త ఆర్డర్ల విషయంలో అనిశ్చితి ఏర్పడటంతో వ్యయ నియంత్రణకు సిద్ధమైంది. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉద్యోగుల జీతాల పెంపును, ప్రమోషన్‌లను వాయిదా వేసింది. నియామకాలను కూడా నిలిపేసింది.
ఇక, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2020 మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారైన ఇన్ఫోసిస్ మార్చితో ముగిసిన త్రైమాసిక లాభం 6.4 శాతం పెరిగి రూ. 4,321 కోట్లు నమోదైంది. ఆర్థిక సంవత్సరం నికర లాభం 7.97 శాతం పెరిగి రూ. 16,639 కోట్లుగా నమోదైంది. ఆదాయం వరుసగా 0.8 శాతం పెరిగి రూ. 23,267 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయపు పన్ను వాపసు రూ. 242 కోట్ల రూపాయలని నివేదించింది. నిర్వహణ లాభం 2.6 శాతం వృద్ధితో రూ. 19,374 కోట్లను నమోదు చేసింది. అలాగే, షేర్‌కు రూ 9.50 చొప్పున ఫైనల్ డివిడెండ్‌ను ప్రకటించింది.
మార్చి 31 నాటికి ఇన్ఫోసిస్‌లో 2,42,371 మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాది ముగిసిన ఇదే త్రైమాసికంలో 2,28,123 మంది ఉన్నారు. కొవిడ్-19 కారణంగా 2020-21 ఏడాదికి సంబంధించి ఆదాయ, మార్జిన్లపై మార్గదర్శకాలను ఇవ్వలేకపోతున్నామని, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మార్గదర్శకాలను వెల్లడిస్తామని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
Tags: Infosys, q4Results, Infosys Results, Infosys Q4 Results, Infosys Earnings