పెంచిన చ‌మురు ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాలి

by Shyam |
mungi jaipal reddy
X

దిశ, గండిపేట్ :‍ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను ప్రభుత్వం వెంట‌నే త‌గ్గించాలని రాజేంద్రన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ముంగి జైపాల్‌రెడ్డి అన్నారు. క‌రోనాతో ఓ ప‌క్క సామాన్యుడు ఇబ్బందులు ప‌డుతుంటే మ‌రో ప‌క్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చ‌మురు ధ‌ర‌లను పెంచి సామాన్యుడి న‌డ్డి విరుస్తున్నాయని ఆవేద‌న వ్యక్తం చేశారు. చ‌మురు ధ‌ర‌లను నిర‌సిస్తూ రంగారెడ్డి జిల్లా పరిధిలోని కందుకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎడ్ల బండి ఎక్కి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముంగి జైపాల్‌రెడ్డి రాజేంద్రన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముంగి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నిత్యవ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌తో పాటు చ‌మురు ధ‌ర‌ల‌ను అదుపు చేశార‌న్నారు.

మోడీ అధికారంలోకి వ‌చ్చాక ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను మ‌రిచిపోయార‌ని విమ‌ర్శించారు. న‌ల్లధ‌నాన్ని వెలికి తెస్తాన‌ని ప్రజ‌ల‌ను నిండా మోసం చేశార‌న్నారు. ఇలాంటి అనేక హామీల‌ను మోడీ విస్మరించార‌న్నారు. ఇక క‌రోనాతో దేశంలో సామాన్యుడు, పేద‌లు అధోగ‌తి పాలైతే మోడీ ప్రభుత్వం చ‌మురు ధ‌ర‌ల‌ను పెంచేసి సామాన్యుల‌ను న‌ట్టేటా ముంచేశార‌న్నారు. మోడీ పాల‌న‌కు రోజులు ద‌గ్గర ప‌డ్డాయ‌ని, రానున్న రోజుల్లో ప్రజ‌లు బీజేపీ ప్రభుత్వానికి త‌గిన బుద్ధి చెప్పడం ఖాయ‌మని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు సాగిస్తుంద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పూల‌ప‌ల్లి రాజేంద‌ర్‌రెడ్డి, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed