ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం రూ. 360 కోట్లు!

by Harish |
ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం రూ. 360 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ఇండ్ 2019-20 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో రూ. 301.74 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2018-19లో ఆర్జించిన నికర లాభం రూ. 360.10 కోట్లతో పోల్చితే ఈసారి 16 శాతం తగ్గినట్టు సంస్థ ప్రకటించింది. ఇక, మొత్తం ఆదాయం రూ. 9,158.57 కోట్లని, మొండి బకాయిలు, ఆకస్మిక నిధి ద్వారా సమీక్షా త్రైమాసికంలో రూ. 2,440.32 కోట్లను బ్యాంకు కేటాయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో దీనికోసం రూ. 1560.69 కోట్లను బ్యాంకు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే, ఆస్తుల నాణ్యత విషయంలో స్థూల నిరర్ధక ఆస్తులు 2.10 శాతం నుంచి 2.45 శాతానికి పెరిగినప్పటికీ..నికర నిరర్ధక ఆస్తులు 1.21 శాతం నుంచి 0.91 శాతానికి తగ్గడం గమనార్హం. మార్చితో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 5.1 శాతం పెరిగి 3,231.2 కోట్ల రూపాయలకు చేరుకుంది.

Tags: IndusInd Bank, IndusInd Bank Q4 Result, Covid 19, Coronavirus

Advertisement

Next Story

Most Viewed