- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్ట కాలంలోనూ కేసీఆర్ పేదల పక్షానే: ఇంద్రకరణ్ రెడ్డి
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: కరోనా కష్ట కాలంలోనూ పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి తీవ్ర గందరగోళంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో పేదల పథకాలు అమలు చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పేదలకు రేషన్, పింఛన్లతో పాటు ప్రభుత్వం తరఫున అమలవుతున్న అన్ని రకాల పథకాలనూ అందజేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రజల సహకారం మరువలేనిదనీ, ఇది పూర్తిగా కనుమరుగయ్యేంతవరకు అన్ని వర్గాలూ సహకరించాలని కోరారు.
Tags: Indrakaran Reddy, distributed, Kalyana Lakshmi checks, adilabad, cm kcr
Advertisement
Next Story