కేసీఆర్ కోసం హరితహారం: ఇంద్రకరణ్

by Shyam |   ( Updated:2020-02-13 07:36:03.0  )
కేసీఆర్ కోసం హరితహారం: ఇంద్రకరణ్
X

ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. ఆయన స్వప్నాన్ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని మంత్రి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా.. అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) శోభతో ఆయన మాట్లాడారు. అడవుల సంరక్షణ, పునరుద్ధరణపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించే దిశగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఆకుపచ్చ తెలంగాణనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు.

Advertisement

Next Story