- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండోనేషియా నుంచి వచ్చినవారెంతమంది?
దిశ, న్యూస్‌బ్యూరో: ఇండోనేషియా నుంచి తెలంగాణకు వచ్చినవారెంతమందో ఇప్పుడు లెక్క తేల్చే పని మొదలైంది. ఇండోనేషియా నుంచి ఢిల్లీ మీదుగా తెలంగాణకు వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయనతోపాటు వచ్చినవారి వివరాలను సేకరిస్తున్నారు. మత ప్రచారం కోసం గత నెల 22న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన బృందంలోని ఒక సభ్యుడికే ఇప్పుడు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇతనితోపాటు ఉన్న మరి కొద్దిమందికి కూడా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. వీరితోపాటు మరి కొంతమంది ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు విచారణలో తేలింది. వారి వివరాలను కూడా సేకరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ లేఖ రాసింది.
గత నెల 22న ఇండోనేషియా నుంచి మతప్రచార కార్యక్రమం కోసం వచ్చినవారెంతమంది? అందులో తెలంగాణకు వచ్చిన టీమ్‌లో ఉన్నవారెందరు? ఇతర రాష్ట్రాలకు వెళ్ళినవారి సంఖ్య ఎంత? ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తదితర వివరాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో ప్రస్తావించింది. ఢిల్లీ నుంచి వారు ఏయే రాష్ట్రాలకు వెళ్ళారు? ఎక్కడెక్కడ తిరిగారు? వారి ద్వారా స్థానికులకు సోకే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? వాటన్నింటిపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. కరీంనగర్ జిల్లాలో ఈ బృందం పర్యటిస్తుండగా కరోనా లక్షణాలు బయట పడటంతో వీరి మతప్రచార అంశం తెలిసింది. వీళ్లు ఇప్పటిదాకా తిరిగిన గ్రామాలతోపాటు ఎంతమందిని కలిశారు అనే అంశంపై కూడా అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.
ఇప్పటిదాకా తెలంగాణలో ఐదు పాజిటివ్ కేసులు నమోదైనా వీరంతా విదేశాల నుంచి వచ్చినవారే. స్థానికంగా ఎవ్వరికీ కరోనా లక్షణాలు గానీ, పాజిటివ్ నిర్ధారణగానీ జరగలేదు. విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాతనే ఈ లక్షణాలు బయట పడ్డాయి.
tags : Telangana, Corona, Indonesia, Delhi, Airport, Positive