ఇండిగో జీతాల కోత!

by Harish |
ఇండిగో జీతాల కోత!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ధాటికి ఇప్పటికే విమానయాన రంగం సగానికిపైగా ప్రభావితమైంది. తాజాగా దేశీయ విమానయాన రంగం ఇండిగో తమ విమాన సర్వీసులను నిలిపేయాలని, అంతేకాకుండా కొందరి ఉద్యోగుల వేతనాల నుంచి కొంత కోత ఉంటుందని స్పష్టం చేసింది. పలు స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు వేతనం తగ్గనున్నట్టు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది.

ఈ నేపథ్యంలో ఇండిగో సీఈవో రనుంజోయ్ దత్తా వేతనంలో 25 శాతం, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఆపై స్థాయి ఉద్యోగులకు 20 శాతం వేతనం తగ్గనుందని పేర్కొంది. ఈ మార్పులు రానున్న ఏప్రిల్ 1 నుంచి అమలవుతాయని చెప్పింది. ఇండియాలో ఇండిగోకు 260 విమానాలున్నాయి. వీటిలొ 16 విమానాలను నిలిపేసింది. అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో పనిచేసే ఉద్యోగులకు 10-20 శాతం వరకూ కోత ఉండనుంది కాబట్టి సహకరించాలని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఉద్యోగులను అభ్యర్థించింది. కరోనా వల్ల విమానయాన రంగం భారీగా ఆర్థిక నష్టాలను భరిస్తున్నాయి. ఈ పరిణామాలను అంచనా వేస్తూనే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని సంస్థ తెలిపింది.

ఇండిగో తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువమంది ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ ప్రభావం విమానయాన సిబ్బిందిలో 30 శాతం, గ్రౌండ్ స్థాయిలో పనిచేసే ఉద్యోగుల్లో 50 శాతం వరకూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

tags : Coronavirus, Coronavirus Impact, IndiGo, Air India, CAPA, IndiGo 16 Planes, IndiGo Lays Off Staff

Advertisement

Next Story

Most Viewed