- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో దూసుకపోతున్న ఓటీటీ.. రాబోయే కాలంలో..
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారీగా ఆదరణ పెరిగిన వీడియో ఓటీటీ మార్కెట్ భారత్‌లో మరింత వేగంగా వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. 2030 నాటికి ఈ పరిశ్రమ ఏకంగా దాదాపు రూ. 95 వేల కోట్లకు చేరుకుంటుందని ఓ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఓటీటీ పరిశ్రమ మార్కెట్ విలువ రూ. 12 వేల కోట్లకు వరకు ఉంది. ఆర్‌బీఎస్ఏ సలహాదారుల నివేదిక ప్రకారం.. మెరుగైన నెట్‌వర్క్, స్మార్ట్‌ఫోన్, డిజిటల్ కనెక్టివిటీ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఈ పరిశ్రమ వృద్ధి గణానీయంగా ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో ఓటీటీ తదుపరి దృష్టి టైర్2, టైర్3, టైర్4 నగరాలతో పాటు భారత్‌లోని ప్రాంతీయ భాషల్లోని వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్రణాళిక ఉండనుంది.
దేశీయంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రోజువారీ సబ్‌స్క్రైబర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. దిగ్గజ ఓటీటీలైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ కాకుండా స్థానిక, ప్రాంతీయ ఓటీటీలు కీలకంగా మారనున్నాయి. వీటిలో వూట్, ఈరోస్‌నౌ, సోనీలైవ్, జీ5 లాంటి ఓటీటీలు మార్కెట్‌ను పెంచుకోనున్నాయని నివేదిక వివరించింది. ఇక, ఆడియో ఓటీటీ మార్కెట్లోని గానా, జియో సావన్, వింక్ మ్యూజిక్, స్పాటిస్‌ఫైన్, ఇంకా ఇతర కంపెనీ వృద్ధి ద్వారా ప్రస్తుతం దాదాపు రూ. 5 వేల కోట్ల వరకు ఉన్న ఈ పరిశ్రమ 2025 నాటికి రూ. 8 వేల కోట్లు, 2030 నాటికి రూ. 19 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా ఓటీటీ మార్కెట్ రాబోయే నాలుగేళ్లలో 28.6 శాతం వార్షిక వృద్ధి సాధిస్తుంది. మరో పదేళ్లలో రూ. 1.2 లక్షల కోట్లకు పరిశ్రమ ఎదగగలదని’ ఆర్‌బీఎస్ఏ అభిప్రాయపడింది.