- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌లలో వరుస ఓటములతో సతమతమైన టీమిండియా టీ20లో ఆల్‌రౌండ్‌షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. శుక్రవారం కాన్‌బెర్రా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్‌పై 11 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత బౌలర్లు అదరగొట్టడంతో ఆసీస్ బ్యాట్‌మెన్స్ చేతులెత్తేశారు. దీంతో భారత్ విజయం సునాయాసమైంది. తొలుత టాస్ గెలిచిన ఆసీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఎదుట ఉంచింది.
వన్డేల్లో వరుస విజయాలతో ఊపుమీద ఉన్న ఆసీస్ స్వల్ప లక్ష్యం అని భావించి, ఈజీగా తీసుకున్నారు. దీంతో కంగారులకు భారత బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు. తొలుత ఓపెనర్లుగా బరిలో దిగిన ఆసీస్ ప్లేయర్లు షార్ట్, ఆరోన్ ఫించ్ మంచి ఆ జట్టుకు మంచి శుభారంభాన్నే ఇచ్చారు. అయితే ఆరోన్ ఫించ్ అవుట్‌తో అవడంతో కష్టాల్లోకి వెళ్లింది. ఫించ్ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు అందరూ వరుసగా పెవిలియన్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 150 పరుగుల చేసి 11 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉండగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా తొమ్మిదోసారి విజయం సాధించి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది.