- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2024 నాటికి ఆ మార్కెట్ రూ.లక్ష కోట్లకు చేరుకుంటుంది
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది డిసెంబర్ నాటికి భారత ఐటీ, వ్యాపార సేవల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 5.4 శాతం వృద్ధితో దాదాపు రూ.96.2 వేల కోట్లకు చేరుకుంటుందని పరిశోధనా సంస్థ ఐడీసీ తెలిపింది. ఈ విభాగం జనవరి-జూన్ మధ్య కాలంలో 5.3 శాతం వృద్ధి చెందగా, గతేడాది ఇదే కాలంలో 8.9 శాతం వృద్ధి నమోదు చేసినట్టు ఐడీసీ తన నివేదికలో పేర్కొంది. ఐటీ, బిజినెస్ సేవల మార్కెట్లో.. ఐటీ సేవల మార్కెట్ ఈ ఏడాది మొదటిసగంలో 77.4 శాతం వాటాను కలిగి ఉంది.
ఈ విభాగం గతేడాది మొదటి సగంలో 9.3 శాతం వృద్ధిని సాధించగా, ఈ సారి 5.9 శాతం వృద్ధిని చెందింది. ఐటీ సేవల మార్కెట్ 2021 నుంచి ఊపందుకుంటుందని, 2019-2024 మధ్య 7.2 శాతం వృద్ధి సాధించగలదని అంచనాలున్నాయి. 2024 చివరి నాటికి ఈ విభాగం దాదాపు రూ. లక్ష కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఐటీ సేవల మార్కెట్ వృద్ధి తగ్గిందని ఐడీసీ పేర్కొంది. ‘వైద్య, టెలికాం, ఐటీ, ప్రభుత్వ రంగం, తయారీ వంటి ప్రధాన రంగాల్లో ఐటీ పెట్టుబడులు పెరిగాయి. ఆయా విభాగల్లో అప్‌గ్రేడ్ కోసం, వ్యాపార కొనసాగింపునకు ఐటీ వినియోగం పెరిగిందని’ ఐడీసీ ఇండియా సీనియర్ రీసెర్చ్ మేనేజర్ శ్వేతా బైద్య చెప్పారు.