25ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పసిడి డిమాండ్

by Shamantha N |
25ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పసిడి డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి దెబ్బకు బంగారం ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో దేశీయంగా డిమాండ్ క్షీణించింది. 2019 ఏడాదితో పోలిస్తే గతేడాది భారత్‌లో బంగారం డిమాండ్ 25 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని ప్రపంచ స్వర్ణమండలి (డబ్ల్యూజీసీ) నివేదిక స్పష్టం చేసింది. 2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్‌లో బంగారం డిమాండ్ భారీగా తగ్గి 446 టన్నులకు తగ్గింది. ఇది 2019లో 690.4 టన్నులుగా నమోదైనట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. చివరిసారిగ 1995లో బంగారం డిమాండ్ 462 టన్నులుగా నమోదైనట్టు డబ్ల్యూజీ ఇండియా మెనేజింగ్ డరెక్టర్ సోమసుందరం పీఆర్ చెప్పారు. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం..2019లో మొత్తం ఆభరణాల డిమాండ్ 544.6 టన్నులు నమోదవగా, సమీక్షించిన కాలంలో 42 శాతం తగ్గి 315.9 టన్నులుగా నమోదైంది.

విలువ పరంగా ఆభరణాల డిమాండ్ 2019లో రూ. 1,33,260 కోట్లతో 22 శాతం తగ్గింది. 2020లో కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ విధించడంతో పాటు బంగారం ధరలు భారీగా పెరిగిపోవడం వల్లే దేశీయంగా డిమాండ్ మూడోవంతు తగ్గింది. అంతేకాకుండా విలువ పరంగా కూడా గణనీయమైన తగ్గుదల నమోదైంది. గతేడాది రెండో భాగంలో పండుగ సీజన్‌తో డిసెంబర్ త్రైమాసికంలో బంగారం డిమాండ్ కొంత మెరుగైంది. ఈ త్రైమాసికంలో దేశీయంగా బంగారం డిమాండ్ 2019తో పోలిస్తే 4 శాతం మాత్రమే తగ్గి 186.2 టన్నులుగా నమోదైంది. విలువ పరంగా 26 శాతం పెరిగి రూ. 82,790 కోట్లుగా ఉంది.

Advertisement

Next Story