భారత తొలితరం క్రికెటర్ వసంత్ రాయ్‌జీ మృతి

by Shyam |
భారత తొలితరం క్రికెటర్ వసంత్ రాయ్‌జీ మృతి
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత సీనియర్ క్రికెటర్ వసంత్ రాయ్‌జీ (100) శనివారం ముంబయిలోని తన స్వగృహంలో మృతిచెందారు. తెల్లవారుజామున 2.20 గంటలకు వృద్ధాప్య సమస్యల కారణంగా మృతిచెందినట్లు వసంత్ అల్లుడు సుదర్శన్ నానావతి మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో వసంత్ తన 100వ పుట్టినరోజును లెజెండరీ క్రికెటర్లు సచిన్, స్టీవ్‌ వా సమక్షంలో జరుపుకున్నారు. 1939లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తరఫన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా రాయ్‌జీ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత బాంబే, బరోడా జట్ల తరఫున కూడా ఆడారు. క్రికెట్ దిగ్గజాలు లాలా అమర్‌నాథ్, విజయ్ మర్చంట్, సీకే నాయుడు, విజయ్ హజారే లాంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకున్నారు. 1941లో విజయ్ మర్చంట్ నేతృత్వంలో ముంబై తరఫున ఆడారు. తన కెరీర్‌లో 9 ఫప్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడారు. దక్షిణ బాంబేలో టీమ్ఇండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పుడు రాయ్‌జీ వయసు 13ఏండ్లు. అప్పుడు ఆయన ఆ మ్యాచ్ ప్రత్యక్షంగా చూశారు. అలా ఇప్పటి వరకు టీమ్ఇండియా ప్రయాణం మొత్తం చూసిన ఏకైక వ్యక్తి రాయ్‌జీ అని చెప్పుకోవచ్చు. క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత క్రికెట్ చరిత్రకారుడిగా పలు పుస్తకాలు రచించారు. చార్టెడ్ అకౌంటెంట్‌గా కూడా ఆయన పనిచేశారు.

Advertisement

Next Story