భారత్ నిర్ణయం బాగుంది: నిక్కీహేలీ

by Anukaran |   ( Updated:2020-07-01 23:24:29.0  )
భారత్ నిర్ణయం బాగుంది: నిక్కీహేలీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ వ్యవహరించిన తీరు తనకు ఆనందం కలిగించిందని ఇండో అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అన్నారు. చైనా వ్యవహార ధోరణిపై వెనుకడుగు వేయడంలేదంటూ భారత్ ను ఆమె ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే.. లడాఖ్ లో చైనా దుశ్చర్య నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన టిక్ టాక్, క్యామ్ స్కాన్ తదితర మొత్తం 59 యాప్ లను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ యాప్ ల వాడకం వల్ల మన వ్యక్తిగత సమాచారం విదేశీ సర్వర్లలో నిక్షిప్తమవుతోందని, భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ తదితర అంశాలకు ఇది హాని చేస్తుందని భావించి ఈ యాప్ లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో నిక్కీహేలీ ఓ ట్విట్ చేశారు. చైనాకు చెందిన యాప్ లను భారత్ నిషేధించడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా చైనా దూకుడు విషయంలోనూ వెనకడుగు వేయకుండా ముందు నిలిచిందంటూ భారత్ ను ఆమె మెచ్చుకున్నారు. అదేవిధంగా అమెరికా విదేశాంగ శాఖ కూడా భారత్ తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తూ పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed