'డాలర్ల కలకు సగటు వృద్ధి అవసరం'

by Harish |
డాలర్ల కలకు సగటు వృద్ధి అవసరం
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఆరేళ్లలో దేశ ఆర్థికవ్యవస్థ వార్షిక సగటు 11.6 శాతంతో వృద్ధిని సాధించగలిగితే..2026-27 నాటికి భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని సీఐఐ-కేర్ రేటింగ్స్ సంయుక్త విజ్ఞాన పత్రం తెలిపింది. భారత ఆర్థికవ్యవస్థను ఈ స్థాయికి చేర్చడానికి 2021-27 మధ్య ఏడేళ్ల కాలంలో మొత్తం రూ. 498 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) పేర్కొంది.

కొత్త పెట్టుబడులు ప్రతి ఏటా సగటున రూ. 43 కోట్ల నుంచి రూ. 103 కోట్లు అవసరమని సంయుక్త పత్రం తేల్చింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న దేశీయ ఆర్థిక వ్యవస్థ 2021-22 నాటికి సానుకూల వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ వైపునకు వెళ్లేందుకు కరోనా మహమ్మారి పెద్ద అడ్డంకిగా మారింది. కరోనా వైరస్ అనిశ్చితి కారణంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని పత్రం పేర్కొంది. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు మౌలిక సదుపాయాల కల్పన అత్యవసరమని, దీనివల్ల ఉపాధి పెరుగుదల, డిమాండ్ వృద్ధి నమోదవుతుందని పత్రం అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed