- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తేనె పూసిన కత్తి..
దిశ, వెబ్‌డెస్క్
ట్రంప్ సర్కారు ఓ వైపు ఇండియాకు స్నేహ హస్తం అందిస్తూనే మరోవైపు విషం చిమ్ముతుంది. భారత్ తమకు నిజమైన మిత్రుడు అని ప్రపంచానికి చెబుతూనే లోలోపల కుట్రలు పన్నడం దానికి అలవాటే. ఈ మాట ఎందుకనాల్సి వచ్చిదంటే అమెరికాలో నేటి నుంచి వలసదారులకు కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. చదువుకోసం హెచ్1బీ వీసా ద్వారా అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోయిన వలస దారులు పర్మినెంట్‌గా ఆ దేశంలోనే ఉండాలంటే గ్రీన్‌కార్డు అవసరం. ఇంతకు ముందు అమెరికా ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు (మెడికల్,ఫుడ్,హౌస్ సంబంధించిన వోచర్స్) ఉపయోగించుకున్నవలసదారులకూ గ్రీన్‌కార్డు లభించేది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఎవరైతే అక్కడి సంక్షేమ పథకాలు వినియోగించుకుంటారో వారికి గ్రీన్‌కార్డు ఇవ్వడం నిషేధం. ఈ నిబంధనల వలన గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్న2.27లక్షల మంది ప్రవాస భారతీయులపై ఇది ప్రతికూల ప్రభావం చూపనుంది.
యేటా చాలా మంది మనదేశం నుంచి అమెరికాకు చదువుకునేందుకు వెళ్లి, అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోయి గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.ఇకపై ఎవరైతే వలసదారులు తాము సంక్షేమ పథకాలు వినియోగించుకోము, పన్నులు కడుతున్న అమెరికన్ పౌరులకు, ఆ దేశానికి భారం కాదలచుకోలేదు అని అఫిడవిట్‌లు సమర్పిస్తారో వారికి మాత్రమే గ్రీన్‌కార్డు కల్పించనున్నారు. అనగా వారికి అమెరికన్ పౌరసత్వం లభించినా సంక్షేమ పథకాలు వర్తించవు. అమెరికాలో సంక్షేమ పథకాలు వినియోగించుకోకుండా ఉండాలంటే చాలా కష్టం.అందుకు అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సిందే. పన్నులు ఎక్కువ మొత్తంలో చెల్లించే స్థోమత ఉన్నవారు అక్కడే ఉంటారు. లేనివారు తమతమ దేశాలకు తిరుగు ప్రయాణమవుతారు.దీంతో ఆమెరికాలో మైగ్రెంట్స్ తగ్గి అక్కడి స్థానికులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతాయనేది ట్రంప్ సర్కార్ భావన.
కేవలం గ్రీన్‌కార్డు మీద అక్కడే నివసించాలనుకునే వారి వలన ఆ దేశానికి అధికమొత్తంలో ఆదాయం కూడా చేకూరుతుంది. ఈ నిబంధన వలన అమెరికాకు రెండు విధాలా లాభం ఉంటుంది. అందువల్లే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అమెరికన్ యువతకు, అక్కడి ప్రజలకు చేరువయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి.గత అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలోకి వలసదారులు ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తానని, స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను అన్ననినాదమే ట్రంప్‌ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిందనేది నమ్మలేని నిజం.