- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడంగ్‌పేట్‌లో సందడి చేసిన ఇండియన్ స్టార్ క్రికెటర్.. నా వంతు కృషిచేస్తనంటూ..
దిశ, జల్‌పల్లి: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఇండియన్ స్టార్ క్రికెటర్ ప్రజ్ఞాయ్ ఓఝా పాల్గొన్నారు. ప్రజ్ఞాయ్ ఓఝా బడంగ్ పేట రావడంతో కార్పొరేషన్ మరింత ముందుకు పోతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓఝా మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ అనేది ఒక మహత్తర కార్యక్రమం అని, ఇటువంటి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని తెలిపారు.
స్వచ్ఛత విషయంలో ప్రజలకు చైతన్యం తీసుకువచ్చి రానున్న సంవత్సరం స్వచ్ఛ బడంగ్ పేట సాధనకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రజ్ఞాయ్ ఓఝా బ్రాండ్ అంబాసిడర్‌గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత సంవత్సరం దక్షిణ భారతదేశంలో నాల్గోవ స్థానంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ నిలిచినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు.