- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త సంవత్సరంలో షాక్ ఇవ్వనున్న బ్యాంక్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఖాతాదారులకు కొత్త ఏడాదిలో షాక్ ఇవ్వనుంది. ఈ బ్యాంకు ఖాతాదారులు పరిమితికి మించి నగదును ఉపసంహరించుకోవడానికి, డిపాజిట్ చేయడానికి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం ప్రతి నెలా నాలుగు సార్లు ‘బేసిక్ సేవింగ్స్ ఖాతా’ నుండి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాపై కస్టమర్లు కనీసం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ పై మాత్రం ఎలాంటి చార్జీలు లేవు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) 3 రకాల పొదుపు ఖాతాలు కలిగి ఉంది. సేవింగ్స్, కరెంట్ ఖాతాలో నెలలో రూ.10,000 డిపాజిట్ చేయడానికి ఎలాంటి చార్జ్ ఉండదు. ఈ పరిమితి కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఖాతాదారులకు అదనపు చార్జీలు విధించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్, కరెంట్ ఖాతా నుంచి ప్రతి నెలా రూ.25,000 విత్‌డ్రా చేయడానికి ఎటువంటి చార్జీ ఉండదు. ఉచిత పరిమితి తర్వాత డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రతిసారీ కనీసం రూ.25 చెల్లించాలి.