వరుసగా ఐదో నెల వృద్ధిని సాధించిన దేశీయ ఫార్మా రంగం

by Harish |
వరుసగా ఐదో నెల వృద్ధిని సాధించిన దేశీయ ఫార్మా రంగం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఔషధ మార్కెట్(ఐపీఎం) జనవరిలో 4.5 శాతం విస్తరించడం ద్వారా వరుసగా ఐదో నెల తన వృద్ధి పథాన్ని కొనసాగించింది. 2020, డిసెంబర్‌లో 8.5 శాతం పెరిగిన తర్వాత గత నెలలో 4.5 శాతానికి పరిమితమైంది. కరోనా తర్వాత పూర్తిస్థాయి పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా సానుకూల వృద్ధిని సాధించిన కంపెనీల జాబితాలో అజంత ఫార్మా 16 శాతం, జేబీ కెమికల్స్ 13.5 శాతం, ఇప్కా 12.5 శాతం, ఆల్కెమ్ 9.3 శాతం, జైడస్ క్యాడిలా 8.1 శాతం వృద్ధి చెందాయి.

అయితే, నాట్కో అమ్మకాలు 38.4 శాతం క్షీణించగా, ఇండికో 5.1 శాతం, అలెంబిక్ 3.6 శాతం, ఎఫ్‌డీసీ 2.7 శాతం తగ్గాయి. ఆనంద్ రతి నివేదిక ప్రకారం..భారత ఫార్మా మార్కెట్లో వృద్ధి సరళంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ వరుస ఐదు నెలల వృద్ధిని కలిగి ఉంది. భవిష్యత్తులో ఇదే ధోరణి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి ఊహించిన దానికంటే తక్కువగా ఉన్నందున దేశీయ ఫార్మా రంగం వృద్ధిని కొనసాగిస్తోంది. కరోనా ఆందోళనలు తగ్గి తీవ్రమైన, సాధారణ చికిత్సల కోసం ఆసుపత్రుల రావడం పెరిగిందని ఆశిస్తున్నట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed