ఇండియ‌న్ నేవీలో 1159 ఖాళీలు

by Anukaran |   ( Updated:2021-02-20 08:30:24.0  )
ఇండియ‌న్ నేవీలో 1159 ఖాళీలు
X

దేశంలోని వివిధ నావికా దళాల్లో గ్రూప్ ‘సి’ గా వర్గీకరించబడిన ట్రేడ్స్‌మన్ మేట్ ఖాళీల భర్తీకి ప్రతి ఏడాదికి నిర్వహించే (ఐఎన్‌సీఈటీ టీఎంఎం 01/2021) భారత నావికాదళం నోటిఫికేషన్ ప్రకటించింది.
ఇండియ‌న్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ – ట్రేడ్స్‌మన్ మేట్(ఇన్‌సెట్‌-టీఎంఎం)

మొత్తం ఖాళీలు: 1159

తూర్పు నావికాదళం: 710 ఖాళీలు (జ‌న‌ర‌ల్‌-303, ఎస్సీ-116, ఎస్టీ-57, ఓబీసీ-163, ఈడ‌బ్ల్యూఎస్‌-71)
వెస్ట్రన్ నావల్ కమాండ్: 324 ఖాళీలు (జ‌న‌ర‌ల్‌-133, ఎస్సీ-48, ఎస్టీ-24, ఓబీసీ-87, ఈడ‌బ్ల్యూఎస్‌-32)
సదరన్ నావల్ కమాండ్: 125 ఖాళీలు (జ‌న‌ర‌ల్‌-57, ఎస్సీ-16, ఎస్టీ-2, ఓబీసీ-37, ఈడ‌బ్ల్యూఎస్‌-13)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థల నుంచి 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణతతోపాటు గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నుంచి సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వ‌య‌స్సు: 7 మార్చి, 2021 నాటికి కనిష్ఠంగా 18ఏండ్లు గరిష్ఠంగా 25ఏండ్లు మించ‌రాదు.
పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ/ మాజీ సైనికులు & మహిళలకు ఫీజు లేదు.
ఇతరులకు: రూ.205

ఎంపిక‌: ఇన్‌సెట్‌-టీఎంఎం టెస్ట్ ద్వారా

పరీక్షా విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. షార్ట్‌లిస్ట్/ అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్/ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్‌పై ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో కూడి ఉంటుంది. ప్రతి విభాగం నుంచి 25 మార్కుల‌కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష తేదీ, సమయం, వేదిక అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి పంపుతారు.
ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 22 ఫిబ్రవ‌రి 2021
చివ‌రితేదీ: 7 మార్చి, 2021
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

Advertisement

Next Story

Most Viewed