మిలియనిల్స్ జెన్ జెడ్‌లో పెరిగిన ఒత్తిడి, ఆందోళన

by Shyam |
millennials
X

దిశ, ఫీచర్స్ : పాండెమిక్ సమయం ప్రపంచానికి ఓ పీడకలగా నిలిచిపోతుంది. ఎంతోమందిని శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీసిన కరోనా చాలామందిని అనాథలుగా మార్చేసింది. అంతేకాకుండా చిన్నారుల నుంచి యువకులు, వృద్ధుల వరకు అందర్నీ అభద్రతాభావంలోకి నెట్టేసింది. అయితే అందరికంటే ఎక్కువగా మిలినియల్స్, జెనరేషన్ – జెడ్‌‌లో చాలా ఒత్తిడి పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కువ పని గంటలతోపాటు, ఇమ్మెన్స్ మెంటల్ ప్రెజర్‌ను కలిగించినట్లు తేలింది. భారతదేశానికి చెందిన డెలాయిట్ మిలినియల్, జనరల్ Z సర్వే- 2021లో భాగంగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

పాండెమిక్ యాంగ్జయిటీ, ప్రెజర్, లైఫ్‌స్టైల్ ఇంపాక్ట్ వంటి అంశాలపై నిర్వహించిన సర్వేలో ఇండియన్ మిలినియల్స్ (49 శాతం)లో ఒత్తిడి, ఆందోళన స్థాయిలు సాధారణ సగటు కంటే ఎక్కువగా పెరిగాయని వెల్లడైంది. ఆయా విషయాల్లో ప్రపంచ సగటు (46 శాతం)తో సమానంగా ఇండియన్ జనరల్ జెడ్స్‌ బాధపడుతున్నారని తేలింది. 81 శాతం మంది యజమానులు, తమ ఉద్యోగుల మెంటల్ వెల్ బీయింగ్ కోసం చర్యలు తీసుకున్నారు. కుటుంబ సంక్షేమం, ఉద్యోగం/వృత్తిపరమైన అవకాశాలు, లాంగ్ టెర్మ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ వంటి అంశాలు మిలినియల్స్, జెన్ జెడ్‌ల ఒత్తిడికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

పాజిటివిటి :

పాండెమిక్ నష్టాన్ని కాదు, పాజిటివ్ అంశాలను కూడా కలిగించినట్లు సర్వేలో తెలిసింది. ఈ క్రమంలోనే ఇండియన్ మిలినియల్స్‌లో 91 శాతం, జెన్ జెడ్స్‌లో 84 శాతం మంది తమ జీవితాన్ని మెరుగుపర్చడానికి మహమ్మారి తమను ప్రేరేపించిందని భావిస్తుండగా, 89 శాతం మిలినియల్స్, 82 శాతం జెన్ జెడ్‌లు తమలో సానుకూల ప్రభావం చూపడంతో పాటు, జీవితంలో కొత్తగా ప్రయత్నించేందుకు ఉపయోగపడిందని తెలిపారు. సానుకూల వ్యక్తిగత మార్పుల విషయంలో పాండెమిక్ తమకు మేలు చేసిందని, మిలినియల్స్, జనరల్ జెడ్‌లు మరింత ఆశాజనకంగా ఉన్నట్లు సర్వే కనుగొంది. తమ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చే విషయంలో శ్రద్ధ పెరగడంతో పాటు, భవిష్యత్‌లో మహమ్మారిని ఎదుర్కొనే విషయంలోనూ తమ సామర్థ్యాన్ని పెంచిందని వారు విశ్వసిస్తున్నారు. ఇక 10 మిలినియల్స్‌లో 9 (90 శాతం) మంది, జెన్ జెడ్‌లో 87 శాతం మహమ్మారి పర్యావరణానికి మేలు చేసినట్లు భావించారు.

Advertisement

Next Story

Most Viewed