ఏసియన్ టీటీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్యం

by Shyam |
Paddlers
X

దిశ, స్పోర్ట్స్: భారత పెడ్లర్లు ఏసియన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించారు. ఖతర్ లోని దోహా వేదికగా జరుగుతున్న ఏసియన్ టీటీ చాంపియన్‌షిప్ 2021లో భారత బృందం శుక్రవారం కాంస్య పతకం సాధించింది. దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్‌లో భారత పెడ్లర్లు 0-3 తేడాతో ఓడిపోయారు. దీంతో భారత బృందంలోని సతియన్ జ్ఞానశేఖరన్, శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, సనిల్ షెట్టీ, మానవ్ ఠక్కర్‌లు క్యాంస్యంతో సరిపెట్టుకున్నారు. 1976 తర్వాత భారత పెడ్లర్లు ఏసియన్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం ఇదే తొలిసారి. ‘పురుషుల టీటీ జట్టు దోహాలో చారిత్రాత్మక విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకున్నారు. 1976 తర్వాత మెడల్ గెలిచిన ఐదుగురు పెడ్లర్లు అభినందనలు’ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. ‘నా సుదీర్ఘ కెరీర్‌లో తొలిసారి ఏసియన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా సెమీ ఫైనల్ ఆడటం చూశాను. అందులో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉన్నది’ అని పెడ్లర్ శరత్ కమల్ అంతకు ముందు ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed