సేఫ్‌గా విశాఖకు 186మంది ఇండియన్స్

by srinivas |
సేఫ్‌గా విశాఖకు 186మంది ఇండియన్స్
X

మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బయలు దేరిన ఎయిర్ ఏషియా-320 విమానం ఎట్టకేలకు విశాఖకు చేరుకుంది. ఎంబీబీఎస్ చదివేందుకు ఫిలిప్పిన్ వెళ్లిన భారతీయ విద్యార్థులు కరోనా నేపథ్యంలో ఇండియాకు తిరుగు ప్రయాణమై కౌలాలంపూర్‌‌లో చిక్కుకున్నారు. అక్కడ బందీలు అయిన వారిలో 186మంది భారతీయులు కాగా కొందరు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ మేరకు బుధవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో భారతీయులను సేఫ్‌గా వైజాగ్‌కు తరలించారు. వీరందరికి ముందుగా కరోనా టెస్టులు చేసి వైరస్ లేదని నిర్దారించుకున్న తర్వాతే ఎవరి ఇంటికి వారిని పంపించనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

tags ; vizag, 186 indians, safe, airasia-320, kuala lumpur, indian govt

Next Story

Most Viewed