- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెకు తల్లిదండ్రుల ఆచూకీ దొరికిందా..?
న్యూఢిల్లీ: ఐదేళ్లుగా తన తల్లిదండ్రుల జాడ కోసం దేశమంతా వెతుకుతున్న బధిర యువతి గీత కలలు ఫలించాయా..? ఆమె తల్లి ఎవరో గుర్తించిందా..? అంటే అవుననే అంటున్నాయి పలు మీడియా కథనాలు. చిన్న వయసులోనే అనుకోని పరిస్థితుల్లో భారత్ నుంచి పాకిస్థాన్ లోని కరాచీకి చేరుకున్న గీతను అక్కడి ఈధీ ఫౌండేషన్ చేరదీసింది. ఆమె ఆలనాపాలనను చూసుకున్నది. గీత గురించి తెలిసిన నాటి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. ఆమెను భారత్‌కు తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు. ఒక స్వచ్ఛంద సంస్థ నీడలో ఆమె తన తల్లిదండ్రుల అన్వేషణ సాగిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆమె తల్లి ఆచూకీ తెలిసినట్టు సమాచారం.
ఈ మేరకు గీతను పెంచి పెద్ద చేసిన ఈధీ ఫౌండేషన్ వివరాలను వెల్లడించినట్టు పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. గీతను కంటికి రెప్పలా చూసుకున్న బిల్కిస్ ఈధీ మాట్లాడుతూ.. ‘గీత మాతో ఇంకా టచ్‌లోనే ఉంది. ఆమెతో మా అనుబంధం కొనసాగుతున్నది. ఇటీవలే తన తల్లిని కలుసుకున్నానని మాకు శుభవార్త చెప్పింది. గీత అసలు పేరు రాధ వాగ్మరే అనీ, మహారాష్ట్రలోని నైగావ్ గ్రామంలో తన కన్నతల్లిని గుర్తించినట్టు మాకు తెలిపింది..’ అని అన్నారు. నైగావ్ గ్రామం ముంబయిని ఆనుకుని ఉన్న పాల్ఘర్ జిల్లాలో ఉంది. కాగా.. గతంలోనూ గీత తమ బిడ్డే అని పలువురు ముందుకు వచ్చారు కానీ వారిలో ఎవరూ డీఎన్ఎ టెస్ట్‌లో అసలైన తల్లిదండ్రులు కాదని తేలింది. తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో గీత గుర్తించానని చెబుతున్న వ్యక్తికి డీఎన్ఎ పరీక్ష చేసినాక గానీ దీనిని ధృవీకరించడానికి లేదు అని ఆమె సంరక్షకులు తెలిపారు.