- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 72 లక్షల లాటరీ గెలుచుకున్న భారతీయుడు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కాలరణంగా అందరూ నష్టాల్లో కూరుకుపోయారు. కానీ, ఈ టైమ్ లోనూ ముఖేష్ అంబానీకి అదృష్టం కలిసి వచ్చినట్లు.. ఓ భారతీయ వ్యక్తికి ధనలక్ష్మి తలుపు తట్టింది. దుబాయ్‌లోని ఎమిరేట్స్ లోటో ప్రారంభోత్సవ డ్రాలో 3,50,000 దిర్హమ్స్ డబ్బులు గెలుచుకుని… ఇంతటి కష్టకాలంలోనూ అదృష్టవంతుడిగా నిలిచాడు. ఇంతకీ ఆ లక్కీ మ్యాన్ పేరు ఏంటంటే.. మహ్మద్ ఖలీద్
మహ్మద్ ఖలీద్ ఉద్యోగ నిమిత్తం రెండు దశాబ్డాల క్రితమే దుబాయ్ కి వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ టెలి కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి అనుకోని రీతిలో అదృష్టం వరించింది. దుబాయ్‌లోని ఎమిరేట్స్ లోటో ప్రారంభోత్సవ డ్రాలో అతడు 3,50,000 దిర్హమ్స్ గెలుచుకున్నాడు. అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.72 లక్షలు. ‘మా టికెట్‌లో ఉన్న ఆరు నెంబర్లు కలవడం చూసి మేం నమ్మలేకపోయాం. మాకు లాటరీ వచ్చిందంటూ ఎమిరేట్స్ లోటో ప్రతినిధులు ఫోన్ చేసి కన్ ఫాం చేయడంతో మా ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది’ అని ఖలీద్ చెప్పారు.
డబ్బులను కుమారులకు పంచుతా…
ఖలీద్ కు ముగ్గురు పిల్లలున్నారు. అందులో పెద్ద కొడుకు కెనడాలో ఉన్నాడని, లాక్డౌన్ వల్ల ఇక్కడకు రాలేకపోయాడని ఖలీద్ తెలిపారు. తనకు లాటరీలో వచ్చిన డబ్బులను తన కుమారులకు పంచుతానని, అదేవిధంగా అదే విధంగా యూఏఈ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ‘10 మిలియన్ రమదాన్ మీల్స్’ కార్యక్రమానికి తన వంతు సాయం చేస్తానని చెప్పాడు. ‘నేను కూడా ఒకరికి సాయం చేసే స్థితికి వచ్చాను. నాకు దక్కిన ఆనందం వారికి కూడా పంచుతా.’ అని ఖలీద్ చెప్పాడు. ‘కొందరి జీవితాలైన మార్చాలనే ఉద్దేశంతోనే ఈ లాటరీ పెట్టామని, ఖలీద్ జీవితం మారిపోయిందని, అతని వల్ల మరికొందరి జీవితం కూడా మార్చుతున్నాడని మేం కోరుకున్నది కూడా ఇదేనని’ ఎమిరేట్స్ లోటో సీఈవో పాల్ సెబాస్టియన్ తెలిపారు.
tags : loto emirates , khalid mohammad, lottery