- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధిరేటు 4.7 శాతమే… అగ్రికల్చర్‌పైనే ఆశలు!
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియా వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి ముగిసిన మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 4.7 శాతానికే పరిమితమవుతుందని రాయిటర్స్ సర్వే అంచనాను ప్రకటించింది. అంతకుముందు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతంగా ఉండేది. ఈ నెల రాయిటర్స్ పోల్ సర్వేలో మొత్తం 24 మంది ఆర్థిక నిపుణుల్లో సుమారు 90 శాతానికి పైగా డిసెంబర్ త్రైమాసికానికి వృద్ధి రేటు 5 శాతానికి దిగువనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే, వ్యవసాయ రంగంలో కొంత మెరుగు ఉండొచ్చని, జనవరిలో నమోదైన 7.59 శాతం అధిక ద్రవ్యోల్బణం వినిమయాన్ని, డిమాండ్‌ను దెబ్బ తీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర గణాంకాల శాఖ దేశ జీడీపీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి 5.0 శాతం ఉండొచ్చని అంచనా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధాన సూచీలు కూడా స్థిరమైన దశలోకి మారే అవకాశం కనిపించడంలేదు. కనీసం సమీప భవిష్యత్తులో కూడా ఆ సూచనలు లేవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ ఎకనామిస్ట్ సాక్షి గుప్తా అన్నారు. ఆర్‌బీఐ ఆర్థిక వృద్ధిని పెంచడానికి వడ్డీ రేటు తగ్గింపులను పరిశీలిస్తున్నారు.