- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతీయ వంటలంటే కారమట..వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్
దిశ వెబ్‌డెస్క్: భారతీయుల వంటలంటే కేవలం మసాలా దినుసులట. అవి తింటే రాత్రి నిద్ర కూడా పట్టదట. భారతీయ భోజనం అంటే కేవలం కూర మాత్రమే, అదీ కూడా కారంతో కూడిన వంటకాలంట.. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జీన్ విగార్టెన్ మన దేశ వంటలపై తన విద్వేషాన్ని ఇలా ప్రదర్శించాడు. మీరు రోజంతా బయటకు వెళ్లి, ఇంటికి రాగానే మీ ప్లేట్‌లో ఉండే చికెన్ కారంతో ఉంటుంది. వాటితో పాటు ఓ కారపు చట్నీ కూడా ఉంటుందని తన భావ దరిద్రాన్ని ఇలా ప్రకటించాడు.
దీనికి భారతీయులు కూడా చాలా ఘాటుగా సమాధానాలు పంపారు. వాషింగ్టన్ డీసీలో నివసించే లాయర్ రబీబా చౌదరి ఇలా అన్నారు. ‘ భారత్‌లో ఉదయమే ఎనిమిది రకాల దినసులతో తయారయిన ఓ ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ ట్వీట్ చేసింది. అవి తినాలంటే అదృష్టం ఉండాలి, నువ్వు ఓ ఇడియట్ అంటూ తిట్టి పోసింది’. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశం వలే విభిన్నమైన ఆహర పదార్దాలుంటాయని వ్యాఖ్యానించారు. ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కూడా దీనిపై తన అభిప్రాయాలను వెల్లడించారు. జీన్ భారతీయ వంటలంటే నీకు ఎం తెలుసు. అది ఒక ఎన్‌సైక్లోపిడీయా( సమస్త శాస్త్రము) అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికైన అయ్యగారు కాస్త తెలివి తెచ్చుకుని తన అభిప్రాయాలను మార్చుకుంటారో…లేక మరోసారి ఏదైనా కామెంట్ పెట్టి మరీ భారతీయుల చేతుల్లో తలంటే పోసుకుంటారో చూడాలి మరీ!