- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భవిష్యత్తుపై సన్నగిల్లుతున్న విశ్వాసం
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ వినియోగదారుల్లో ప్రస్తుత పరిస్థితులపై నిరాశ ఆవహించి ఉందని, భవిష్యత్తుపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నివేదిక తెలిపింది. దేశీయ వినియోగంపై ఆధారపడిన ఆర్థికవ్యవస్థలో ఈ పరిణామాలు ప్రజల్లో ఖర్చు చేసే అవకాశాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆర్‌బీఐ వినియోగ విశ్వాస సర్వే (సీసీఎస్) అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరలు, సొంత ఆదాయం, ఖర్చులు వంటి వాటిపై ఆర్‌బీ సీసీఎస్ సర్వే నిర్వహిస్తుంది.
ఆర్‌బీఐ సీసీఎస్ సూచీ స్కేలులో 100ను కొలమానంగా భావిస్తారు. 100 కంటే తక్కువగా ఉంటే నిరాశవహ దృక్పథం.. పైన ఉంటే ఆశావహ దృక్పథంతో ప్రజలు ఉన్నట్టుగా భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో సూచీ మార్చి నెలకు సంబంధించి 53.1 శాతానికి పడిపోయింది. సుమారు 13 నగరాల్లో వినియోగ విశ్వాస సర్వే నిర్వహించారు. వీటిలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, జైపూర్, ముంబై, కోల్‌కతా, లక్నో, గౌహతి, పాట్నా, తిరవనంతపురం ఉన్నాయి. ఆర్‌బీఐ నిర్వహించే ద్వైమాసిక ద్రవ్య పాలసీ సమీక్షలో ఈ సర్వేలో నిర్వహించే ఆయా అంశాలకు ఆర్‌బీఐ ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా ఈ ప్రజల్లో ఈ నిరాశకు కారణం దేశంలో మొత్తంగా ఆర్థిక పరిస్థితి, ధరలు, ఆదాయంపై సెంటిమెంట్ దెబ్బతినడమే అని స్పష్టమైంది. వినియోగ విశ్వాస సూచీ గతేడాది సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో 49.9ని తాకింది. ఆ తర్వాత మార్చి సూచీ కనిష్టంగా నమోదైంది.