- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బ్యాంకాక్ వెళ్లిన బ్యాడ్మింటన్ ప్లేయర్లు

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ జట్టు ఆదివారం బ్యాంకాక్ బయలుదేరి వెళ్లారు. ఒలంపిక్స్ ఆశావహులైన సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ థాంయ్‌లాండ్‌లో జరుగనున్న థాయ్‌లాండ్ ఓపెన్ – 1, 2 టోర్నీల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడే నిర్వహిస్తున్న బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 1000 సిరీస్‌లో కూడా పాల్గొంటారు. మరో స్టార్ షట్లర్ పీవీ సింధు లండన్ నుంచి బ్యాంకాక్ బయలుదేరింది.
గత ఏడాది అక్టోబర్ నుంచి బ్యాడ్మింటన్ ఇంగ్లాండ్ మిల్టన్ కీస్ సెంటర్‌లో సింధు సాధన చేస్తున్నది. బ్రిటన్ జట్టుతో కలసి ఆమె దోహా మీదుగా బ్యాంకాక్ చేరుకోనున్నట్లు సమాచారం. గత ఏడాది కరోనా కారణంగా కేవలం డెన్మార్క్ 750 మాత్రమే జరిగింది. భారత్ తరపున కిదాంబి శ్రీకాంత్ ఒక్కడే ఈ టోర్నీలో పాల్గొన్నాడు. ఒలంపిక్స్ బెర్తులు దక్కాంలంటే ఈ సిరీస్‌లలో విశేషంగా రాణించాల్సిన అవసరం ఉండటంతో టీమ్ ఇండియా ప్లేయర్లు గత కొన్ని రోజులుగా తీవ్రమైన సాధన చేస్తున్నారు.