చైనీయులను కాపాడిన భారత ఆర్మీ

గువహతి: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో దారితప్పిన ముగ్గురు చైనా పౌరులకు భారత ఆర్మీ సహాయపడింది. 17,500 ఎత్తు ప్రాంతంలో దాదాపు జీరో టెంపరేచర్‌తో కఠిన శీతోష్ణస్థితిలో దారి తప్పి ప్రయాసపడుతున్న వారిని (ఇద్దరు పురుషులు, ఒక మహిళ) దరిచేరి ఆక్సిజన్, ఆహారం, నీరు అందించి ప్రాణాలను రక్షించారు. వారిని తమ లక్ష్యాలను చేరే దారిని చూపించి సూచనలు ఇచ్చారు. భారత ఆర్మీ సహకరించడంపై ముగ్గురు చైనా పౌరులు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయినట్టు ఆర్మీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు భారత పౌరులను చైనా ఆర్మీ అపహరించిందని అరుణాచల్ టైమ్స్ కథనం ప్రచురించడం శోచనీయం. భారత ఆర్మీ మేలు చేస్తే.. చైనా మాత్రం కీడు చేయడం గమనార్హం.

Advertisement