భారత అగ్రిటెక్ పరిశ్రమలో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు

by Harish |
భారత అగ్రిటెక్ పరిశ్రమలో భారీగా పెరుగుతున్న పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి పరిస్థితులు, నియంత్రణ విధానాల్లో మార్పుల నేపథ్యంలో భారత్‌లోని అగ్రిటెక్ పరిశ్రమ గణనీయమైన పెట్టుబడులను సాధిస్తున్నట్టు ఓ నివేదిక తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే 2025 నాటికి అగ్రిటెక్ పరిశ్రమ సుమారు రూ. 2.23 లక్షల కోట్ల నుంచి రూ. 2.6 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బైన్ అండ్ కంపెనీ నివేదిక అభిప్రాయపడింది. అగ్రిటెక్ పెట్టుబడులను సాధించడంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడో స్థానంలో ఉంది. 2017 నుంచి 2020 వరకు మూడేళ్లలో 1 బిలియన్ డాలర్ల(రూ. 7,500 కోట్లు) విలువైన నిధులను పొందింది.

ఈ మూడేళ్ల కాలంలో వ్యవసాయ విభాగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా అగ్రోస్టార్, వేకూల్ ఫుడ్స్ అండ్ ప్రోడక్ట్స్, హస్క్ లాంటి సంస్థల్లో పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే గత కొన్ని సంవత్సరాలుగా భారత అగ్రిటెక్‌లో కూడా పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. 2017లో ఈ విభాగంలో 91 మిలియన్ డాలర్లు(రూ. 680 కోట్లు) నుంచి 2020లో 329 మిలియన్ డాలర్ల(రూ. 2,500 కోట్ల)కు చేరుకుంది. ఇది వార్షిక ప్రాతిపదికన 53 శాతం వృద్ధి కావడం విశేషం. ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నామని బైన్ నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed