బులిటెన్ విడుదల.. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులంటే..?

by vinod kumar |
బులిటెన్ విడుదల.. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గతకొద్ది రోజుల నుంచి రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 17,296 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 407 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,90,401 కు చేరుకుంది. ఇందులో లక్షా 89 వేల 463 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2 లక్షల 85 వేల 637 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జయ్యారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 15,301 కి పెరిగిపోయింది.

Advertisement

Next Story