గబ్బాలో గర్జించిన భారత్.. ఆస్ట్రేలియా గడ్డపై సంచలన విజయం

by Anukaran |   ( Updated:2021-01-19 02:59:12.0  )
గబ్బాలో గర్జించిన భారత్.. ఆస్ట్రేలియా గడ్డపై సంచలన విజయం
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్ గర్జించింది. ఆస్ట్రేలియా గడ్డపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బ్రిస్బేన్‌లో గబ్బా స్టేడియంలో 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ శుభ్‌మన్ గిల్(91) పరుగులతో అద్భుత ఆరంభాన్నిచ్చాడు. ఆ తరువాత రోహిత్ శర్మ(7), చటేశ్వర పూజారా (56),కెప్టెన్ అజింక్యా రహానే (24), చివరి వరకూ క్రీజులో నిలిచి, ఫోర్‌తో జట్టుకువిజయాన్నందించిన రిషభ్ పంత్ (89) పరుగులు చేయగా మయాంక్ అగర్వాల్(9),వాషింగ్ టన్ సుంధర్ (22), శార్దూల్ ఠాకూర్ (2) పరుగులు చేసి ఔటయ్యారు. కాగా గబ్బా స్టేడియం కంగారులకు కంచుకోటలాంటింది. ఆసిస్ టీమ్ ఈ గ్రౌండ్ లో ఆడిన 55 టెస్ట్ మ్యాచ్‌ల్లో 33 విజయం సాధించగా 8 టెస్ట్ మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. 13 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఒక మ్యాచ్ టై అయ్యింది. అయితే భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా కంచుకోట గబ్బా కోట బీటలు వారేలా, 1988 నుంచి గబ్బా ఓటమెరుగని కంగారులను చావు దెబ్బ తీశారు.

Advertisement

Next Story

Most Viewed