వెల్‌కమ్ టు ఇండియా : ప్రధాని మోడీ

by Shamantha N |
వెల్‌కమ్ టు ఇండియా : ప్రధాని మోడీ
X

దిశ,వెబ్‌డెస్క్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేడు ఇండియాకు రానున్నారు. ఈ రోజు, రేపు భారత్ పర్యటనలో భాగంగా ఆయన బిజీబిజీగా గడపనున్నారు.ట్రంప్ రాక కోసం భారత్ ఎదురు చూస్తోందని ప్రధాని మోడీ ఇప్పటికే ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. భారత కాలమానం ప్రకారం నేడు ఉదయం 11.40కి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు ట్రంప్ చేరుకోనున్నారు.అక్కడినుంచి మొతేరా స్టేడియం వరకు ప్రధాని మోడీతో కలిసి ర్యాలీలో పాల్గొననున్నారు.అనంతరం మధ్యాహ్నం 12.15గంటలకు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాత 1.05గంటలకు మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.లంచ్ బ్రేక్ తర్వాత సాయంత్రం 5.15గంటలకు ట్రంప్ ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శనకు సతీ సమేతంగా వెళ్లనున్నారు. మరుసటి రోజు ఉదయం 10గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అగ్రరాజ్య అధినేతకు స్వాగత కార్యక్రమం ఉంటుంది. 10.30కు రా‌జ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధిని ప్రధాని మోడీతో కలిసి సందర్శించి నివాళులర్పించనున్నారు.11గంటలకు హైదరాబాద్ హౌస్‌లో భారత్-అమెరికాకు సంబంధించి వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. అందులో భాగంగా ఇరుదేశాల నేతలు కొన్నిభాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు,ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.ఆ తర్వాత రాష్ట్రపతి ఇచ్చే అతిథ్యానికి సతీసమేతంగా హాజరుకానున్నారు.చివరగా రాత్రి 7.30కి రాష్ట్రపతి కోవింద్‌ను కలిసి ముచ్చటించనున్నారు.ఆపై అమెరికాకు ట్రంప్ తిరుగు ప్రయాణం కానున్నట్టు సమాచారం.

పటిష్ట భద్రత..

ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్ పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.దేశ రాజధానితో సహా అహ్మదాబాద్‌లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో సైన్యం, పారామిలిటరీ దళాలు ఇప్పటికే మొహరించి తనిఖీలు చేపడుతున్నాయి.వాటితో పాటు ఎన్ఎస్‌జీ కమాండోలు, స్నైపర్లు, స్వాట్ బృందాలను కూడా అదనపు భద్రత కింద ఏర్పాటు చేశారు.గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోనే 10వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారంటే ట్రంప్‌ పర్యటనను ఇండియా ఎంత సీరియస్‌గా తీసుకున్నదో అర్థం చేసుకోవచ్చు.అదే విధంగా ఆగ్రాలో 3వేల మంది భద్రతా సిబ్బందితో ట్రంప్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం.

Read also..

నేడు మహబూబ్‌నగర్‌లో కేటీఆర్ పర్యటన

Advertisement

Next Story

Most Viewed