ఇండియా-శ్రీలంక మ్యాచ్ అఫీషియల్స్ వీళ్లే

by Shyam |
ఇండియా-శ్రీలంక మ్యాచ్ అఫీషియల్స్ వీళ్లే
X

దిశ, స్పోర్ట్స్: ఇండియా-శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 18 నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది. 3 వన్డేలు, 3 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు అన్నీ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నారు. ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో ఉన్న కుమార ధర్మసేన అన్ని మ్యాచ్‌లలో అంపైరింగ్ చేయనున్నారు. ఇక రంజన్ ముదుగాలె మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనుండా.. మరో నలుగురు ఐసీసీ అంతర్జాతీయ ప్యానల్ నుంచి ఎంపిక చేశారు. రుచిర పల్లియగురుగే, ప్రగీత్ రంబుక్‌వెల్లా, రవీంద్ర విమలసిరి, లిండన్ హన్నిబాల్‌లు అంతర్జాతీయ ప్యానల్ నుంచి అంపైర్లుగా ఎన్నికయ్యారు.

కరోనా ఆంక్షల కారణంగా విదేశీ ప్రయాణాలు కష్టం కావడంతో అంతర్జాతీయ మ్యాచ్‌లకు న్యూట్రల్ అంపైర్లను ఐసీసీ తాత్కాలికంగా రద్దు చేసింది. అదే దేశానికి చెందిన ఐసీసీ అంపైర్లను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది. బయోబబుల్‌లో పూర్తి కరోనా ఆంక్షల నడుమ జరుగనున్న ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదని శ్రీలంక క్రికెట్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed