ధాటిగా ఆడుతున్న కివీస్

by Shyam |
ధాటిగా ఆడుతున్న కివీస్
X

న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి వన్డే హోరాహోరీగా సాగుతోంది. 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్ జట్టు ధాటిగా ఆడుతోంది. 37 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. రాస్ టేలర్ 73, టామ్ లాథమ్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్ రాణించడంతో తొలి వికెట్‌ నష్టానికి 85 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ బ్లండెల్ 9 పరుగులు చేసి ఔటయ్యాడు. వికెట్లు పడుతుండటంతో హెన్రీ నికోల్స్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. 82 బంతుల్లో 78 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాస్ టేలర్స్ అర్ధశతకంతో రాణించాడు.

Advertisement

Next Story