- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అదరగొట్టిన టీమిండియా.. అఫ్ఘనిస్తాన్ ముందు భారీ టార్గెట్
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తిరిగిపుంజుకుంది. నిర్ణీత 20 ఓవరల్లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 210 పరుగులు నమోదు చేసింది. వరుసగా రెండు (పాకిస్తాన్-న్యూజీలాండ్) మ్యాచుల్లో ఘోరంగా విఫలమైన టాప్ ఆర్డర్.. అఫ్గనిస్తాన్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్-రోహిత్ శర్మలు ఆది నుంచి ధాటిగా ఆడారు. వరల్డ్ కప్ చరిత్రలోనే టీమిండియా ఓపెనర్లుగా రోహిత్-కేఎల్ రాహుల్ అత్యధిక భాగస్వామ్యాన్ని(140) నెలకొల్పారు. రోహిత్ శర్మ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 74 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు తీశాడు. గుల్బాదిన్ బౌలింగ్‌లో బ్యాక్ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరు పెవిలియన్ అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(27), హార్దిక్ పాండ్యా(35) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రెండు వికెట్ల నష్టానికి టీమిండియా భారీ స్కోర్ 210/2 నమోదు చేసింది. దీనికితోడు ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లో అత్యధిక టార్గెట్ నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా నిలవడం విశేషం.