- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ 200కి.మీ.. బాలిస్టిక్ క్షిపణి తయారీపై డీఆర్డీవో కసరత్తులు
భారత రక్షణరంగ అభివృద్ధి, పరిశోధన సంస్థ డీఆర్డీవో మరో సరికొత్త బాలిస్టిక్ క్షిపణి తయారీకి సిద్ధమవుతున్నది. 200కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యమున్న వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు రక్షణరంగ వర్గాల సమాచారం. ఇప్పటికే 150కిలో మీటర్లలోని లక్ష్యాన్ని ఛేదించగల ‘ప్రహార్’ అనే క్షిపణి భారత రక్షణరంగంలో ఉన్న విషయం విదితమే. అయితే, మరింత మెరుగైన క్షిపణి కావాలన్న భారత ఆర్మీ సూచన మేరకు ప్రహార్‌కు కొనసాగింపుగానే, ‘ప్రణాశ్’ అనే ఈ సరికొత్త క్షిపణిని అభివృద్ధి చేయనున్నది. ప్రణాశ్ అభివృద్ధి పరీక్షలు 2021చివర్లో ప్రారంభించనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ఈ క్షిపణి అందుబాటులోకి వచ్చిందంటే మిత్రదేశాలకూ ఎగుమతులు చేయొచ్చని తెలిపారు. దాని స్థాయి క్షిపణుల్లో.. ప్రణశ్ ప్రపంచంలోనే అతి చవకైనదిగా నిలుస్తుందని చెప్పారు.