- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశీయ మార్కెట్లో భారీగా పెరుగుతోన్న ఎఫ్ఎంసీజీ యాడ్ ఖర్చులు
దిశ, వెబ్‌డెస్క్: వినియోగ వస్తువులు(ఎఫ్ఎంసీజీ) ఫుడ్, డ్రింక్ బ్రాండ్ల ప్రకటనల వ్యయం పెరుతున్న నేపథ్యంలో రాబోయే మూడేళ్లలో భారత్ ఈ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలవనుంది. దేశీయంగా ప్రకటనల వ్యయం ఏడాదికి 14 శాతం పెరుగుతోందని పబ్లిసిస్ గ్రూపునకు చెందిన మీడియా ఏజెన్సీ జెనిత్ నివేదిక తెలిపింది. యూఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా సహా 12 మార్కెట్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా, ఎఫ్ఎంసీజీ ఫుడ్ అండ్ డ్రింక్ మార్కెట్ ఏడాదికి 2-5 శాతం మధ్య స్థిరమైన వృద్ధి నమోదవుతోంది.
భారత్‌లో యాడ్ మార్కెట్ భారత జీడీపీలో 0.36 శాతం మాత్రమే ఉంది. ఇది ప్రపంచ సగటు 0.7 కంటే తక్కువ. 2023 నాటికి ప్యాకేజ్ చేసిన ఫుడ్, కూల్ డ్రింక్ బ్రాండ్‌లు ప్రకటనల వ్యయం డిజిటల్ ఛానెళ్లలో ఏడాదికి 7 శాతం పెరుగుతుందని, డిజిటల్ యాడ్‌ల వ్యయం 2020లో సుమారు రూ. 91.9 వేల కోట్లు ఉండగా ఇది 2023 నాటికి సుమారు రూ. 1.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. అలాగే, వీటి మార్కెట్ వాటా 46 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుందని తెలిపింది. ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు ఇప్పటికీ టీవీ యాడ్‌లపైనే ఆధారపడుతున్నాయి. 2020లో టీవీ యాడ్‌ల కోసం ఈ బ్రాండ్లు 39 శాతం ఖర్చు చేశాయి. అయితే, ఇటీవల టీవీల్లో యాడ్‌లకు ఆదరణ తగ్గుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది యువతపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తోందని, డిజిటల్ ఛానెళ్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలను కంపెనీ మొదలుపెట్టాలని నివేదిక అభిప్రాయపడింది.