టాటా గ్రూపుకే ఆర్మీ విమానాల ప్రాజెక్టు..

by Harish |
aeropleane
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల పెట్టుబడులు ప్రారంభమయ్యాయి. తాజాగా భారత ఆర్మీలో వినియోగానికి విమానాలను సరఫరా చేసేందుకు దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ సిద్ధమవుతోంది. దీనికోసం స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థతో కలిసి భారత ఆర్మీకి విమానాలను తయారు చేస్తుంది. అంతేకాకుండా త్రివిధ దళాలకు వివిధ పరికరాలను, భారీ యంత్రాలను తయారు చేయనుంది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యం నేపథ్యంలో ప్రభుత్వం ఆర్మీకి కావాల్సిన సీ295 విమానాలను తయారీ అవకాశాన్ని టాటా సంస్థకు ఇచ్చింది.

భారత ఆర్మీతో జరిగిన ఒప్పందం ప్రకారం రూ. 22,000 కోట్ల విలువైన ప్రాజెక్టును టాటా గ్రూప్ దక్కించుకుంది. భారత ఆర్మీకి చరిత్రలో ప్రైవేట్ ప్రాజెక్టుల్లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైన ఒప్పందమని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 56 విమానాల్లో 16 విమానాలను స్పెయిన్ దేశంలోనే తయారు చేసి రెండేళ్లలో భారత ఆర్మీకి ఇవ్వనున్నారు. మిగిలిన విమానాలను దేశంలోనే తయారు చేస్తారు. ఈ విమానాలను భారత ఆర్మీకి అప్పగించేందుకు టాటా సంస్థకు పదేళ్ల వ్యవధి ఉంది. ఈ క్రమంలో ఆర్మీ ప్రాజెక్టులో భాగంగా టాటా గ్రూప్ విమానాల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్, బెంగళూరు, ఉత్తరప్రదేశ్‌లలో ఏదొక చోట స్థాపించే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed