- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్ భూభాగమే
మలేషియా, పాకిస్థాన్ ప్రధానుల సంయుక్త సమావేశంలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ అనేది ఎప్పటికీ భారత్‌లో శాశ్వతమైన భూభాగమని పునరుద్ఘాటించింది. గురువారం విదేశాంగ వ్యవహార అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థాన్ మూల కేంద్రం. ఆ దేశం ఉగ్రవాదులను నియమించుకుంటోంది. శిక్షణ ఇస్తోంది. ఆయుధాలను సమకూరుస్తోంది. ఆర్థిక సాయం అందించి భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఉగ్రవాదులను సరిహద్దులను దాటిస్తోంది. మేం మళ్లీ ఒక్కసారి మలేషియా దేశ నాయకత్వాన్ని నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలని కోరుతున్నాం’ అని అన్నారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మలేషియాలో పర్యటించారు. తన పర్యటనను ముగించుకుని వెళ్లే సమయంలో ఇరుదేశాల ప్రధానుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఇందులో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.