భారత్, రష్యా, చైనాలపై ట్రంప్ ఆరోపణలు 

by vinod kumar |   ( Updated:2020-10-16 11:31:09.0  )
భారత్, రష్యా, చైనాలపై ట్రంప్ ఆరోపణలు 
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, రష్యా, చైనాలపై నోరుపారేసుకున్నారు. ఈ మూడు దేశాల గాలిని కలుషితం చేస్తున్నాయని ఆరోపించారు. అమెరికా మాత్రం పర్యావరణం, ఓజోన్, ఇతరత్రాలన్నింటిలోనూ మెరుగ్గా ఉన్నదని అన్నారు. అలాగే, లాక్‌డౌన్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.

కరోనా కారణంగా సమావేశాలను నిలిపేయడాన్ని నిరసించారు. అమెరికా అధ్యక్షుడిగా బేస్‌మెంట్‌లో తనను తాను బంధించుకోబోరని, చాలా మందితో తాను భేటీ కావల్సి ఉంటుందని అన్నారు. మాస్కులు ధరించడంతోనీ ప్రయోజనం లేదని అన్నారు. మాస్కులు ధరించినా వైరస్ సోకుతూనే ఉన్నదని చెప్పారు.

Advertisement

Next Story