ఒక్క చుక్కా పట్టదు..నిల్వలన్నీ నిండిపోయాయి!

by Harish |   ( Updated:2020-04-22 07:31:34.0  )
ఒక్క చుక్కా పట్టదు..నిల్వలన్నీ నిండిపోయాయి!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి దిగజారాయి. కొవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ పూర్తీగా నిలిచిపోయింది. దీంతో పెట్రోల్‌కు డిమాండ్ పడిపోయింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా అన్ని దేశాల్లోనూ చమురు నిల్వలు నిండిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగదారైన ఇండియాలో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. దేశంలోని 66,000 పంప్ స్టేషన్లు సహా అన్ని కంటైనర్లలో నిల్వ సామర్థ్యం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు అన్నీ నిండిపోయాయని, నిల్వ చేసుకోవడానికి సామర్థ్యం అస్సలు లేదని, దేశంలో ఉన్నటువంటి 85 మిలియన్ బ్యారెల్స్ ఇంధన నిల్వ సామర్థ్యం ఉంటే అందులో 95 శాతం ఫుల్ అయినట్టు అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పది శుద్ధి కర్మాగారాల్లోనూ కార్యకలాపాలను సగానికి తగ్గించారు. మిగిలినదాంట్లో 35 శాతం పనిచేస్తున్నాయని ఎఫ్‌జీఈ కన్సల్టెంట్ పేర్కొన్నారు. ఇక, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియా బయట లీజుకు తీసుకున్న కార్గోలలో నిల్వ చేసి ఉండొచ్చని తెలిపారు. ఇండియా మొత్తం చమురు ఉత్పత్తి డిమాండ్ ఈ త్రైమాసికంలో ఒక రోజుకు 1.4 మిలియన్ బ్యారెల్‌ల చొప్పున క్షీణిస్తుందని అంచనా వేస్తున్నారు. చమురు డిమాండ్ మళ్లీ పుంజుకునే అవకాశం ఇప్పట్లో లేదని బీపీచీఎల్ రిఫైనరీ డైరెక్టర్ చెప్పారు.

కొవిడ్-19 కేసులు పెరగడం వల్ల ప్రధాన నగరాల్లో వినియోగ కేంద్రాలు ఇబ్బందుల్లో ఉన్నట్టు, చమురు ధరలు చరిత్రలో తొలిసారి ఊహించని స్థాయిలో తగ్గడం, శుద్ధి చేసిన ఇంధనాలను నిల్వ చేయడానికి అందుబాటులో ఉన్న స్థలాలను లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై ఆయిల్ సంస్థలు స్పందించలేదు. రిటైల్ స్టేషన్లలో, ఇండియా రిఫైనరీల్లో 300కి మించి డిపోలు, టెర్మినల్, 250 ఏవియేషన్ ఇంధన స్టేషన్లలో పెట్రోల్ ఇంధనాలను నిల్వ చేస్తారు. మొత్తం సామర్థ్యంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా డీజిల్ నిల్వ చేసేందుకు, మరో 20 శాతం గ్యాసోలిన్ నిల్వ చేయడానికి వాడతారు. లాక్‌డౌన్ వల్ల అన్ని రకాల రవాణాలు రద్దవడంతో ఇండియాలోఇ సగం పెట్రోల్ బంకుల్లో పనులన్నీ ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ పడిపోయింది. ఇండియా చమురు డిమాండ్‌లో సంగంపైన డీజిల్, గ్యాసోలిన్ వినియోగం ఈ నెల రెండు వారాల్లోనే 60 శతం క్షీణించింది. ఇక, లాక్‌డౌన్ మే 3 వరకు ఉండనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలుంటాయో వేచిచూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

పెట్రోలియం ఉత్పత్తుల వాడకం దిగజారడంతో చమురుకు డిమాండ్ తగ్గింది. దీంతో బుధవారం కూడా రికార్డు స్థాయిలో బ్రెంట్ చమురు ధర బ్యారెల్ 24 శాతం తగ్గి 16 డాలర్లకు దిజగారింది. ఇక, సోమవారం చరిత్రలో లేనంతగా తగ్గిన డబ్ల్యూటీఐ క్రూడాయిల్ బ్యారెల్‌కు 11.42 డాలర్లకు చేరింది. కొవిడ్-19 ప్రభావంతో చమురు వినియోగం భారీ స్థాయిలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే చమురు ఉత్పత్తి కొనసాగడంతో ధరలు క్షీణించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అన్ని దేశాల నిల్వ సామర్థ్యం నిండిపోయాయి. ఎగుమతి లేని కారణంగా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించుకునే ఆలోచనలో పడ్డాయి. ఉత్పత్తి తగ్గించకపోతే భవిష్యత్తులో ధరలు మరింత దిగజారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags: space to store oil, Petrol pumps full, Refiners in India, Ril, bpcl

Advertisement

Next Story