భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

by Shamantha N |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు, మరణాలు మరోసారి పెరిగాయి. ఇందుకు సంబందించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 50,848 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ నిర్ధారణ అయినవారి సంఖ్య 3,00,28,709 చేరింది. నిన్న ఒక్కరోజే 1,358 మంది వైరస్‌తో మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,90,660 కు పెరిగింది. మంగళవారం ఒక్క రోజే 68,817 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,89,94,855 మంది బాధితులు పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో 6,43,194 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed