- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ జీడీపీ అంచనా తగ్గింపు!
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ప్రభావాలతో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ వృద్ధి అంచనాను ఫిచ్ సొల్యూషన్ సంస్థ 4.6 శాతానికి తగ్గించింది. ప్రైవేట్ వినియోగం బలహీనంగా మారడం, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పెట్టుబడుల్లో సంకోచం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు క్షీణించడం ఈ అంచనాల తగ్గింపుకు కారణమని సంస్థ నివేదిక ఇచ్చింది.
ఇండియా రేటింగ్స్:
కరోనా వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అనేక సమస్యలను ఉత్పన్నం చేస్తోంది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరిణామాలతో ప్రముఖ ఏజేన్సీ ఇండియా రేటింగ్స్ దేశ జీడీపీ వృద్ధిని 5.5 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గించింది.
ఏప్రిల్ చివరి వరకు లాక్‌డౌన్ కొనసాగనుండగా మే నెల నుంచి ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించడం జరుగుతుందని ఇండియా రేటింగ్స్ సంస్థ తెలిపింది.