బాలుడికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్రపతి

by Shamantha N |
బాలుడికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్రపతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాష్ట్రపతి ఓ బాలుడికి బహుమానం పంపారు. స్వయంగా రాష్ట్రపతి సైకిల్ గిఫ్ట్ ఇచ్చారంటే ఆ బాలుడు రామ్‌నాథ్ కోవింద్‌కు చుట్టాలు అనుకుంటే పొరపాటే. ఢిల్లీలో ఓ హోటల్‌లో పనిచేస్తున్న రియాజ్ అనే అబ్బాయికి ఈ బహుమానం అందజేశారు.

దేశరాజధానిలో ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రియాజ్.. పార్ట్ టైమ్‌ ఉద్యోగం(హోటల్‌లో) చేస్తున్నాడు. ఎప్పటికైనా సైక్లింగ్‌లో టాపర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. వీలు పడ్డప్పుడల్లా సైక్లింగ్‌లో తన ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. అతడి ప్రతిభను గుర్తించిన రామ్‌నాథ్ కోవింద్ స్వయంగా సైకిల్ బహుకరించి.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆ బాలుడికి ప్రొత్సాహం కల్పించేందుకు తన వంతు సాయం అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story